గ్రీన్‌ గాడెస్‌ స్మూతీ

కావాల్సినవి: సన్నగా తరిగిన అరకప్పు లేత పాలకూర ఆకులు (బేబీ స్పినాచ్‌)

నాలుగు పైనాపిల్‌ ముక్కలు

పావు కప్పు ఆవకాడో

అరకప్పు నీళ్లు

వీటన్నింటిని జ్యూసర్‌లో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి.

తరువాత ఈ జ్యూస్‌ను వడగట్టకుండా డైరెక్టుగా తాగాలి.

గర్భిణులకు ఈ స్మూతీ అన్ని రకాల పోషకాలను అందిస్తుంది.

ఎందుకంటే, లేత పాలకూర ఆకుల్లో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది.

పైనాపిల్‌లో విటమిన్‌ సి, ఆవకాడోలో మంచి కొవ్వులు ఉంటాయి.