నోరూరించే గోంగూర మటన్‌ తయారీ ఇలా

కావలసినవి: మటన్‌ – అర కేజీ

గోంగూర – పా వు కేజీ (ఆకులు)

పసుపు – టీ స్పూన్‌

అల్లంవెల్లుల్లి పేస్ట్‌ – టేబుల్‌ స్పూన్‌

ఉల్లిపా య ముక్కలు – కప్పు

మిరప్పొ డి– టీ స్పూన్‌

ధనియాలపొ డి– టీ స్పూన్‌

జీలకర్రపొ డి– అర టీ స్పూన్‌

పచ్చి మిర్చి – 5 (నిలువుగా చీరాలి)

కొత్తిమీర – చిన్న కట్ట

గరం మసాలాపొ డి– టీ స్పూన్‌

షాజీర– టీ స్పూన్‌

యాలకులు – 2

దాల్చిన చెక్క – అంగుళం ముక్క

లవంగాలు – 2

ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి

నూనె – 2 టేబుల్‌ స్పూన్‌లు.

తయారీ: ప్రెషర్‌ కుక్కర్‌లో మటన్, జీలకర్రపొ డి, ధనియాల΄పొ డి, మిరప్పొ డి, అరకప్పు నీరు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడికించాలి.

పెనంలో నూనె వేడి చేసి గరం మసాలా దినుసులన్నీ వేసి వేగిన తర్వాత ఉల్లిపా య ముక్కలు, ఉప్పు వేయాలి.

ఉల్లిపా య ముక్కలు రంగు మారిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చివాసన పోయేవరకు వేగనివ్వాలి.

ఇప్పుడు పసుపు, పచ్చిమిర్చి, గోంగూర ఆకులు వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉడికించాలి.

గోంగూర మెత్తబడిన తర్వాత మటన్‌ (ఉడికించిన నీటితోపా టు) వేసి కలిపి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి.

చివరగా అవసరాన్ని బట్టి మరికొంత నీటిని వేసి కలిపి గరం మసాలాపొ డి, కొత్తిమీర ఆకులు వేసి కలిపి దించేయాలి.