పచ్చి చిన్న చేపలు – కేజీ

కారం – మూడు టీస్పూన్లు

కరివేపాకు – రెండు రెమ్మలు

అల్లం – రెండు అంగుళాల ముక్క

పుల్లటి పచ్చి మామిడి కాయ – ఒకటి

పచ్చికొబ్బరి తురుము – కప్పు

పసుపు – చిటికెడు

పచ్చిమిర్చి – నాలుగు

ఉప్పు – రుచికి సరిపడా

గార్నిష్‌ కోసం: ఆవాలు – టీస్పూను, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, కరివేపాకు – రెమ్మ, ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు.

మామిడికాయ తొక్కతీసి ముక్కలుగా తరిగిపెట్టుకోవాలి

చేపలను శుభ్రం చేసి నీచు వాసనలేకుండా ఐదారుసార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి

అల్లంని తొక్కతీసి పేస్టుచేయాలి

పచ్చికొబ్బరి తురుములో పసుపువేసి మెత్తగా రుబ్బుకోవాలి

బాణలిలో మామిడికాయ ముక్కలు, కరివేపాకు, అల్లం పేస్టు, పచ్చిమిరపకాయలు, కారం, రుచికి సరిపడా ఉప్పు, కప్పు నీళ్లుపోసి ఉడికించాలి ∙

మామిడికాయ ముక్కలు ఉడికిన తరువాత శుభ్రం చేసి పెట్టుకున్న చేపలను వేయాలి

చేపలు ఉడికిన తరువాత కొబ్బరి పేస్టు వేసి మరో 10 నిమిషాలు ఉడికించి దించేయాలి

ఇప్పుడు తాలింపు బాణలిలో ఆయిల్‌ వేసి వేడెక్కనివ్వాలి, ఆయిల్‌ వేడెక్కిన తరువాత ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి

ఉల్లిపాయలు బ్రౌన్‌ రంగులోకి మారాక తాలింపుని ఉడికిన చేపల కూరలో వేసి కలుపుకుంటే చేపల ఇగురు రెడీ