కావలసినవి: ఉడికించిన గుడ్లు – నాలుగు

పచ్చిమిర్చి – మూడు

ఉల్లిపాయలు – రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్‌ స్పూను, టొమాటోలు – రెండు, ధనియాల పొడి – టేబుల్‌ స్పూను, గరంమసాలా – టేబుల్‌ స్పూను

కారం – రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చి మామిడికాయ తురుము – రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు – అరటీస్పూను, పసుపు – అరటీస్పూను,

ఆయిల్‌ – మూడు టేబుల్‌ స్పూన్లు, కొత్తి మీర తరుగు – టేబుల్‌ స్పూను, ఉప్పు – రుచికిసరిపడా , కరివేపాకు – రెండు రెమ్మలు.

తయారీ.. ∙ముందుగా గుడ్ల పెంకుతీసి పక్కనపెట్టుకోవాలి

ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పేస్టుచేసి పెట్టుకోవాలి ∙ స్టవ్‌ మీద బాణలి పెట్టి ఆయిల్‌ వేయాలి.

ఇది వేడెక్కిన తరువాత ఆవాలు వేయాలి ∙ఆవాలు చిటపటలాడాక ఉల్లిపాయ పేస్టు వేసి వేగనివ్వాలి.

తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ∙ఇప్పుడు పసుపు, ధనియాల పొడి వేసి తిప్పాలి

టొమాటలు, పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేయాలి ∙టొమాటో ముక్కలు మెత్తబడిన తరువాత కరివేపాకు గుడ్లను ముక్కలు చేసి వేయాలి

ఐదు నిమిషాల తరువాత కారం, మామిడికాయ తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి పదినిమిషాలు మగ్గనివ్వాలి

పదినిమిషాల తరువాత కొత్తిమీర చల్లి దించేయాలి