Kitchen Tips: గారెలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే..

గారెలు చేసేముందు మజ్జిగలో చెయ్యి తడిచేసుకుంటే గారెలు ఎక్కువ నూనెను పీల్చుకోవు.

కుకర్‌లో కాకుండా ఇతర పాత్రలో మటన్‌ కూరను వండేటప్పుడు ముక్క త్వరగా ఉడకదు.

ఇటువంటి సమయంలో మటన్‌ కూరలో టీస్పూను నెయ్యివేస్తే ముక్క త్వరగా మెత్తబడుతుంది.

సబ్బు కవర్లను బయటపడేయకుండా కప్‌బోర్డులో పెట్టుకుంటే కప్‌బోర్డు నుంచి కమ్మటి సబ్బు వాసనలు వస్తాయి.

వెండి వస్తువులు తొందరగా రంగు మారడం, నల్లగా అవ్వడం జరుతుంటుంది.

అలాంటప్పుడు వాటిని గాలిచొరబడని పాలిథిన్‌ బ్యాగ్‌లో వేసి ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో పెట్టి భద్రపరచుకోవాలి

ఇలా చేయడం వల్ల నల్లబడటం, రంగు మారడం వంటి సమస్యలు లేకుండా కొత్తవాటిలా మెరుస్తాయి.