అమ్మాయిలు వేసుకునే కొన్ని టాప్‌లకు మెడభాగంలో ఓపెన్‌ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇబ్బందిగా అనిపిస్తుంది.

ఇలాంటప్పుడు రెండు వైపులా అతుక్కునే డబుల్‌ స్టిక్కర్‌ టేపుని అతికించుకుంటే టాప్‌ పై భాగం క్లోజ్‌ అవుతుంది.

ఇలానే బటన్‌ ఊడిన దగ్గర, సైడ్‌ కట్స్‌ ఎక్కువ అనిపించినప్పుడు కూడా ఈ డబుల్‌ స్టిక్కర్‌ టేపు అతికించుకుంటే సరిపోతుంది.

పువ్వుల నవ్వులు.. ప్లెయిన్‌ హంగులు కుచ్చుల చమక్కులు.. ఎంబ్రాయిడరీ మెరుపులు

ఇవన్నీ ఒకే రంగుతో ఆకట్టుకుంటే అది నేటి పార్టీవేర్‌ లెహంగా డ్రెస్‌ అవుతుంది.

అంచుల రంగుతో ఓణీ.. అదే రంగుతో ఛోలీ అనే నిన్నటి కళకు చుక్కను చుట్టి టాప్‌ టు బాటమ్‌ ఒకే కలర్‌.. ఒకే ప్రింట్‌.. ఒకే వర్క్‌ ఉంటే అదిరిపోద్ది

ఒకే రంగుతో ప్లెయిన్‌ లెహంగా డ్రెస్‌ వెస్ట్రన్, గెట్‌ టు గెదర్‌ పార్టీలకు వన్నె తీసుకువస్తున్నాయి.

ఇక ఒకే కలర్‌ లెహంగా, ఛోలీ, దుపట్టాపై కొన్ని ప్రింట్లు, మరికొన్ని ఎంబ్రాయిడరీ వర్క్‌తో చేసిన డిజైన్స్‌ వివాహ వేడుకలకు నిండుదనాన్ని తీసుకువస్తున్నాయి.

వీటిలో ఫ్లోరల్‌ డిజైన్స్‌ నేటి మగువలను మరింతగా ఆకట్టుకుంటున్నాయి.