నోరూరించే ఖోయా నారియల్‌ లడ్డు

కావలసినవి: పాలకోవా – కప్పు

కొబ్బరి కోరు – అరకప్పు

చక్కెర లేదా బెల్లం తురుము– అర కప్పు

యాలకుల పొడి– టీ స్పూన్‌

కిస్‌మిస్‌– పది

జీడిపప్పు – పది

తయారీ : మందపాటి బాణలిలో కొబ్బరి కోరు, కిస్‌మిస్, జీడిపప్పు వేసి సన్నమంట మీద వేయించాలి.

కొబ్బరి వేగిన తర్వాత పాలకోవా. బెల్లం, యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి.

వేడి తగ్గి మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డులు చేసుకోవాలి.