డయాబెటిస్‌ పేషెంట్లు తినదగిన పండ్లు ఏవంటే..!

ఆపిల్‌: ఒక యాపిల్‌ డాక్టర్‌ని దూరంగా ఉంచుతుంది అన్నమాట అక్షరాల నిజం. ఇది తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉండటేమ గాక అధిక బరువుని తగ్గిస్తుంది

జామకాయ: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ఇది తీసుకుంటే అనూహ్యంగా గ్లూకోజ్‌ స్థాయిలు తగ్గుతాయని పేర్కొంది.

ఆరెంజ్‌లు: ఇవి తీసుకుంటే ఇమ్యూనిటీ లెవెల్స్‌ పెరగడమే గాక మంచి ఫైబర్‌ అందుతుంది.

కివీ: ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది

డయాబెటిస్‌ పేషెంట్లు తినకూడని పండ్లు ఏంటంటే..!

మామిడి: పండిన మామిడిపండు తీసుకుంటే ఒక్కసారిగా శరీరంలో గ్లూకోజ్‌ లెవెల్స్‌ పెరిగిపోతాయి. వర్కౌట్‌లు చేసేవారికి సమస్య లేకపోయినా తినకపోవడమే మంచిది.

ద్రాక్ష: ఇందులో కూడా తీపి ఎక్కువగా ఉంటుంది. కావున ఇది తీసుకుంటే శరీరంలో ఒక్కసారిగా ఘుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోతాయి.

లిచ్చి: ఇది కూడా మితంగా తీసుకుంటేనే మంచిది. లేదంటే షుగర్‌ లెవెల్స్‌ అమాంతం పెరిగిపోతాయి.

అరటిపళ్లు: ఇందులో షుగర్‌ కంటెంట్‌, ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. అందువల్ల డయాబెటిస్‌ పేషెంట్ల తీసుకోకపోవడమే మంచిది.