కొబ్బరి పులిహోర తయారీ ఇలా

కావలసినవి: శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు – 1 టీ స్పూన్‌ చొప్పున

పచ్చిమిర్చి – 3 (నిలువుగా కట్‌ చేసుకోవాలి)

ఎండుమిర్చి – 2 (అడ్డంగా తుంచుకోవాలి)

కరివేపాకు – 2 రెమ్మలు

ఎండు కొబ్బరి కోరు – 1 కప్పు

అన్నం – రెండున్నర కప్పుల పైనే (పొడిపొడిగా ఉండాలి)

నిమ్మరసం – 1 టేబుల్‌ స్పూన్‌

ఉప్పు – తగినంత

నూనె – కొద్దిగా

కళాయిలో నూనె వేడి చేసుకుని.. అందులో పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండు మిర్చి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి.

తర్వాత కొబ్బరి కోరు జోడించి.. దోరగా వేయించుకోవాలి

అందులో అన్నం వేసుకోవాలి.

అనంతరం తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసుకుని బాగా కలిపి వేడివేడిగానే సర్వ్‌ చేసుకోవాలి.

ఇక లంబసింగి.. లెక్క పక్కా..!

మహిళల ‘చిరు’ యత్నం.. ఫలిస్తున్న పాత పంటల సాగు

ఆటో డ్రైవర్‌ కొడుకు నుంచి టీమిండియా కీలక పేసర్‌గా!