రోజూ కోడి గుడ్లు తింటే లాభాలివే..

అక్టోబర్‌ 14 ప్రపంచ గుడ్డు దినోత్సవం

గుప్పెడంత ఉండే గుడ్డులో పోషకాలు పుష్కలం

విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు కలిగిన సూపర్‌ ఫుడ్‌

భారత పౌష్టికాహార సంస్థ గుర్తించిన 650 ఆహార పదార్థాల్లో గుడ్డు మొదటిది

50 గ్రాముల గుడ్డులో ఎనర్జీ 72 కేలరీలు ఉంటే, 6.3 గ్రాముల ప్రొటీన్లు, 4.8 గ్రాముల కొవ్వు, 28 గ్రాముల కాల్షియం

0.9 గ్రాముల ఐరెన్, విటమిన్‌ ఏ 270 ఐయూ, విటమిన్‌ డి 41ఐయూ ఉంటాయి.

విటమిన్‌ ఏ ఆరోగ్యకరమైన కణాల వృద్ధికి, చర్మం, కళ్లు వాటి కణజాలకు ఎంతో అవసరం

విటమిన్‌ బి–12 ఎర్ర రక్తకణాల తయారీకి, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి, మెదడు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.

కొలిన్‌ శరీరంలోని నాడీ, కండరాల వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి దోహదపడుతుంది.

గుడ్డులోని సెలీనియంతో ఆరోగ్యకరమైన రోగ నిరోధకశక్తి

ఎముకలు, పళ్ల నిర్మాణానికి అవసరమైన కాల్షియాన్ని అందిస్తుంది.