సాయంత్రం వేళ చేమ కూర స్నాక్‌ చేసుకోండిలా

కావలసినవి: చేమ ఆకులు – 6

రవ్వ – అర కప్పు

మసాలా కోసం: కొబ్బరి ముక్కలు– అర కప్పు

ధనియాలు – టేబుల్‌ స్పూన్‌

జీలకర్ర – అర టేబుల్‌ స్పూన్‌

చింతపండు – గోళీ అంత

బెల్లం పొడి – టేబుల్‌ స్పూన్‌

ఎండు మిర్చి – 3

ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి

పోపు కోసం: నూనె– టేబుల్‌ స్పూన్‌

కొబ్బరి తురుము – అర కప్పు

బెల్లం పొడి– టేబుల్‌ స్పూన్‌

తయారీ: ∙చేమ ఆకులను శుభ్రం చేసి చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి

మసాలా దినుసుల కోసం తీసుకున్న అన్నింటినీ మిక్సీలో వేసి నీటిని వేస్తూ ముద్దగా గ్రైండ్‌ చేసుకోవాలి. ∙ఈ మసాలా లో , చేమ ఆకు వేసి కలపాలి

రవ్వ కూడా వేయాలి. దీనిని నాలుగు భాగాలు చేసి లడ్డులుగా చేసి ఆవిరి మీద ఉడికించాలి. వేడి తగ్గిన తరవాత మెల్లగా చిదమాలి.

ఇప్పుడు పెనం పెట్టి నూనె వేడి చేసి కొబ్బరి తురుము, బెల్లం పొడి వేసి వేయించాలి.

అవి వేగిన తరవాత ఉడికించిన చేమకూర ఆకుల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. తీపి ఇష్టపడేవాళ్లు దీనిని బ్రేక్‌ఫాస్ట్‌గా తింటారు.

భోజనం తరవాత తినడానికి బాగుంటుంది. ఈవెనింగ్‌ స్నాక్‌గా కూడా బాగుంటుంది.