రేగు పళ్ళనే భోగిపళ్ళు అంటాము.

భోగిపళ్ళు పొయ్యటానికి రేగుపళ్ళు, చెరుకు ముక్కలు తీసుకోవాలి

వీటితో పాటు పచ్చదనాన్ని కోరుతూ పచ్చి శనగలు, గురు గ్రహ అనుగ్రహం కోసం నానబెట్టిన శనగలను, దిష్టిని పోగొట్టే కొన్ని ద్రవ్యాలను, వక్కల లాంటి నల్లని గింజలను కలపాలి.

చామంతి, గులాబీ, బంతిపూల వంటి పూరేకలను, అక్షతలను, రాగి నాణాలను లేక చిల్లర నాణాలను చేర్చాలి

వీటిని రెండు చేతులతో తీసుకుని, పిల్లలను తూర్పుముఖంగా కూర్చోబెట్టి వారికి పైనుంచి కిందికి దిగతుడచాలి

తరువాత గుండ్రంగా సవ్యంగా, అపసవ్యంగా పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ దిష్టి తీసి వారి తల మీద పోయాలి.

భోగిపళ్ళు పొయ్యటం వెనక అంతరార్థం దృష్టి దోషం పరిహరించటం

చెడు సోకకూడదని కోరుకోవటం

శుభం కలగాలని ఆశీర్వదించటం.