పనీర్‌ కూర చేసేటప్పుడు.. ముక్కలు మరింత మృదువుగా రావాలంటే పనీర్‌ ముక్కలను వేడినీటిలో పదినిమిషాలు నానబెడితే సరిపోతుంది.

ఇలా చేస్తే పనీర్‌ను ఆయిల్‌లో ఫ్రైచేయాల్సిన అవసరం ఉండదు.

ఆకు కూరలు వండేటప్పుడు వంటపాత్రమీద మూతపెట్టి ఉడికించాలి.

మూతపెట్టడం వల్ల ఆకుకూరల్లోని విటమిన్లు, పోషకాలు ఆవిరవ్వకుండా కూరలోనే ఇమిడి ఉంటాయి.

వంకాయలను వేయించే ముందు వాటిపైన కొద్దిగా ఆయిల్‌ రాస్తే త్వరగా కాల్చడంతోపాటు, వంకాయ తొక్క త్వరగా ఊడిపోతుంది.

పప్పులో ఉప్పు ఎక్కువైనప్పుడు... బియ్యప్పిండి కలిపిన నీళ్లను పోసి కాసేపు ఉడికించాలి.

ఇలా చేయడం వల్ల పప్పులో ఉప్పదనం తగ్గడమేగాక, పప్పురుచి మరింత పెరుగుతుంది.

అరటీస్పూను అలోవెరా జెల్, టీస్పూను జోజోబా నూనె, కొద్దిగా కొబ్బరి నూనె, రెండు టీస్పూన్ల నీళ్లను తీసుకోవాలి.

వీటన్నింటిని స్ప్రేబాటిల్‌లో వేసి బాగా కలపాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిక్కుబడిన జుట్టుపై స్ప్రేచేసి దువ్వెనతో దువ్వితే చిక్కుమృదువుగా విడిపోతుంది.