ఎండాకాలం.. నల్లచీమల బెడద ఉంటే ఇలా చేయండి

ఒక్కోసారి ఇంట్లో చీమలు పుట్టలు పెడుతుంటాయి.

వాటిని వదిలించుకోవడం చాలా కష్టం.

ఎండాకాలం వచ్చిందంటే నల్లచీమల బెడద ఎక్కువ.

ఇవి కుట్టవు కానీ చికాకు పెడతాయి.

వాటిని వదిలించుకోవాలంటే బట్టల సబ్బు లేదా స్నానపు సబ్బును తురిమి అవి వచ్చే దారిలో వేయాలి.

పుట్ట దగ్గర వేస్తే వాటికి సబ్బు ఘాటు పడదు కాబట్టి వెంటనే పారిపోతాయి.

అల్లం వెల్లుల్లి ముద్ద చేసి పెట్టుకుంటాం కదా..

వాటిని మిక్సీలో వేసేటప్పుడు కాస్తంత నూనె వేస్తే అల్లం వెల్లుల్లి పేస్టు మృదువుగా రావడమే కాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కూడా.

ధనియాలను వేయించి చల్లార్చి డబ్బాలో నిల్వ చేస్తే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

ఒకోసారి ఎక్కువ మొత్తంలో కరేపాకు తెచ్చుకుంటాం. ఎంత జాగ్రత్త చేసినా అది ఎండి పోతుంటుంది.

అదేవిధంగా ఒకోసారి కూరలో వెయ్యాలంటే కాసింత కూడా కరేపాకు దొరకదు.

అలాంటప్పుడు కరివేపాకును నూనెలో వేయించి చల్లారాక సీసాలో నిల్వ ఉంచుకుంటే ఏదైనా కూర చేసుకున్నప్పుడు ఈ కరేపాకు కలిపితే మంచి రుచి వస్తుంది.