బేసిన్‌ లడ్డు ఇలా తయారు చేస్తే.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే

కావలసినవి: శనగపిండి – 500 గ్రాములు; పంచదార – 500 గ్రా; నెయ్యి – 400 గ్రా;

నీళ్లు – 150 మి.లీ; యాలకుల పొడి – 1/2 టీస్పూన్‌; జీడిపప్పు – 50 గ్రా;

తయారీ: పంచదారను నీటిలో కరిగించాలి. ఈ మిశ్రమాన్ని స్టౌ మీద పెట్టి మరిగించాలి.

పంచదార మిశ్రమాన్ని బాగా చిక్కని పాకం అయ్యేదాకా ఉంచాలి.

నెయ్యి వేసి, కిందకు దించి, ఈ మిశ్రమం చల్లారనివ్వాలి.

జీడిపప్పును సన్నగా తరగాలి.

మందపాటి, వెడల్పాటి గిన్నెను స్టౌమీద పెట్టి, నెయ్యి వేసి, శనగపిండిని వేయించాలి.

టేబుల్‌ స్పూన్‌ నీళ్ళు చిలకరించి, బాగా కలుపుతూ మంచి వాసన వచ్చేదాకా వేయించాలి.

యాలకుల పొడి, పంచదార మిశ్రమం, జీడిపప్పులను గోరువెచ్చగా ఉన్న శనగపిండిలో వేసి కలపాలి.

చేతులకు నెయ్యి రాసుకుని, కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ, లడ్డూలను తయారుచేయాలి.