కావలసినవి: కర్బూజ ముక్కలు – కప్పు, పుచ్చకాయ ముక్కలు – కప్పు, ఐస్‌క్యూబ్స్ – ఆరు, బ్లాక్ సాల్ట్ – పావు టీస్పూను, తేనె – టీస్పూను.
కర్బూజ, పుచ్చకాయ ముక్కలు, ఐస్‌క్యూబ్స్‌ను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
గ్రైండ్ అయిన జ్యూస్‌ను గ్లాసులో పోసి బ్లాక్‌సాల్ట్ వేసి కలిపి, తర్వాత తేనె వేసి సర్వ్ చేసుకోవాలి.
మిగతా ఫ్రూట్స్‌తో పోలిస్తే కర్బూజ, పుచ్చకాయలో క్యాలరీలు తక్కువగా ఉండి, నీరుశాతం ఎక్కువగా ఉంటుంది.ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది
దీనిలోని విటమిన్ సి, జలుబు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మరింత ప్రేరేపించి బలంగా తయారు చేయడంలో విటమిన్ సి ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఫ్రీర్యాడికల్స్ విడుదలై ఒకరకమైన క్యాన్సర్లు రాకుండా చేస్తాయి.
ఇందులోని విటమిన్ ఏ చర్మం, కళ్ల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.