ఘుమఘుమలాడే బీరకాయ రొయ్యల కూర

కావాల్సినవి: రొయ్యలు – అరకేజీ (΄పొ ట్టు వలిచినవి)

బీరకాయ – అరకేజీ

పసుపు – అర టీ స్పూన్‌

పచ్చిమిర్చి– 2

ఉల్లిపా యలు – 4

అల్లంవెల్లుల్లి పేస్ట్‌ – టీ స్పూన్‌

ఆవాలు – టీ స్పూన్‌

జీలకర్ర – టీ స్పూన్‌

కరివేపా కు – 4 రెమ్మలు

ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచిని బట్టి

నూనె – 4 టేబుల్‌ స్పూన్‌లు.

తయారీ: రొయ్యలను ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి మందంగా ఉన్న పా త్రలో వేయాలి.

అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మిరప్పొ డి, కొద్దిగా నూనె వేసి కలిపి పదినిమిషాల సేపు పక్కన ఉంచాలి.

బీరకాయ చెక్కు తీసి ముక్కలుగా తరగాలి.

పెనంలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపా య ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తర్వాత కరివేపా కు వేయాలి.

ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి సన్నమంట మీద ఉడకనివ్వాలి.

రొయ్యలు, మసాలా మిశ్రమం ఉన్న పా త్రను మరొక స్టవ్‌ మీద పెట్టి సన్న మంట మీద ఉడికించాలి (ఇందులో నీరు పోయనక్కరలేదు

రొయ్యలు ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని బీరకాయ ఉడుకుతున్న పా త్రలో వేయాలి.