బెల్లంతో.. ముఖంపై ముడతలకు చెక్‌ పెట్టొచ్చు ఇలా

బెల్లంతో తయారు చేసిన ఫేస్‌ వాష్‌ యాంటీ ఏజింగ్‌గా పనిచేసి ముడతలను కనిపించనియ్యదు.

చిన్న బెల్లం ముక్క తీసుకుని ఒక గిన్నెలో వేసి, సరిపడా నీళ్లుపోసి మరిగించాలి.

బెల్లం కరిగిన తరువాత టీస్పూను శనగపిండి,

టీస్పూను పెరుగు వేసి చక్కగా కలుపుకోవాలి

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఏడు నిమిషాలపాటు గుండ్రంగా మర్దన చేయాలి.

తరువాత ఇరవై నిమిషాలపాటు ఆరనిచ్చి చల్లటి నీటితో కడిగేయాలి.

ముఖాన్ని తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్‌ లేదా అలోవెరా జెల్‌ రాసుకోవాలి.

ఈ ఫేస్‌ వాష్‌ను వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వాడాలి

ఇలా చేయడం వల్ల ముఖం మీద సన్నని గీతల్లా కనిపించే ముడతలు తగ్గుముఖం పడతాయి.