సరైన పద్ధతులలో సరైన సౌందర్య చిట్కాలను వాడటం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు.

సులువుగా ఇంట్లో లభించే పదార్థాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు.

వీటి వలన చర్మ రక్షణ సులభం కావడంతోపాటు ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.

జిడ్డు కారే చర్మం ఉన్నవారు ఇంట్లో ఈ ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు.

మూడు టేబుల్‌ స్పూన్ల ముల్తాని మట్టిలో టేబుల్‌ స్పూను తేనె, టేబుల్‌ స్పూను అలోవెరా జెల్ వేసుకోవాలి.

తర్వాత రెండు టేబుల్‌ స్పూన్లు రోజ్‌ వాటర్‌ వేసి చక్కగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పూతలా వేసి ఆరిన వెంటనే చల్లటి నీటితో కడిగేయాలి.

ఆరాక మరింత ఎక్కువ సేపు ఉంచుకుంటే చర్మం పొడిబారుతుంది.

ఈ ప్యాక్‌ను రెండు రోజులకొకసారి వేసుకోవడం వల్ల ముఖంపై కారుతున్న జిడ్డు తగ్గుతుంది.

అధికంగా ఉన్న ఆయిల్, టాక్సిన్స్‌ తొలగి చర్మం ఫ్రెష్‌గా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.