ట్యాన్‌ తొలగించుకునే చిట్కా చెప్పిన ఇలియానా

‘దేవదాస్‌’తో ఎంట్రీ ఇచ్చి పోకిరి సినిమాతో కుర్రాళ్ల డ్రీమ్‌గర్ల్‌గా మారిన హీరోయిన్‌ ఇలియానా

ఈ గోవా అందానికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే

అయితే తన అందం వెనుక రహస్యానికి అమ్మ చెప్పిన చిట్కాలే కారణం అంటోంది ఇలియానా

ట్యాన్‌ను తొలగించుకునే సీక్రెట్‌ అభిమానులతో పంచుకుంది

కొంచెం టైమ్‌ దొరికితే చాలు.. రోడ్డు మీద పడి తిరుగుతుంటాను.

దాంతో వెంటనే ట్యాన్‌ అయిపోతాను.

దీన్ని పోగొట్టుకునే చిట్కాను మా అమ్మ దగ్గరే తెలుసుకున్నా.

వెరీ సింపుల్‌.. శనగ పిండిలో మీగడ కలిపి.. దాన్ని స్క్రబ్‌లా మొహానికి, మెడకు. చేతులకు.. వీపుకు పట్టించి.. కడిగేసుకుంటే చాలు

ట్యాన్‌ అంతా పోయి ఈవెన్‌ టోన్‌లో మెరిసిపోతాం

ఫటా పోస్టర్‌ నిఖ్లా హీరో సినిమాతో బాలీవుడ్‌కు వెళ్లిన ఇలియానా అక్కడే పాగా వేసిన విషయం తెలిసిందే.