గులాబీ రంగు పెదవుల కోసం బీట్‌రూట్‌ రసం.. ఇంకా..

పెదాలు ఆకర్షణీయమైన గులాబీ రంగులో ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే సరి!

►ఉదయాన్నే బ్రష్‌ చేసిన తరువాత.. బ్రష్‌ మీద కొద్దిగా తేనె వేసి రెండు పెదవులపైన గుండ్రంగా ఐదు నిమిషాలపాటు రుద్దాలి.

ఇలా రోజూ చేయడం వల్ల పెదాలపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి.

పెదాలకు మర్ధన జరిగి రక్తప్రసరణ సక్రమంగా అందుతుంది. ►పెదవులు మృదువుగా మారతాయి.

ఉదయం బ్రష్‌తో మర్ధన చేసాక, రాత్రి పడుకునేముందు మాయిశ్చరైజర్‌ తప్పనిసరిగా రాయాలి.

కొద్దిగా బీట్‌రూట్‌ రసాన్ని వేడి చేయాలి. ►అలా వేడిచేసిన రసంలో అరటీస్పూను కార్న్‌ప్లోర్‌ వేసి ఐదు నిమిషాలు కలియబెట్టి తర్వాత దించేయాలి.

చల్లారిన తరువాత ఈ మిశ్రమంలో అరటీస్పూను గ్లిజరిన్, పావు టీస్పూను కొబ్బరి నూనె కలిపి ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో నిల్వచేయాలి.

ఈ మిశ్రమం గట్టిపడిన తరువాత పెదవులకు రాసి మర్ధన చేసి పడుకోవాలి. ►ఉదయం నీటితో కడిగేయాలి.

ఈ రెండింటిని ఒకదాని తరువాత ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తే పెదవులు గులాబిరేకుల్లా కోమలంగా పింక్‌ కలర్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.