అలోవెరా జెల్‌తో నైట్‌ క్రీమ్‌.. నల్లటి మచ్చలకు చెక్‌

గ్రీన్‌ టీ శాచెట్‌ ఒకటి తీసుకుని నీటిలో వేయాలి.

దీనిలో రెండు టీస్పూన్ల కాఫీ పొడి వేసి మరిగించాలి.

ఈ మిశ్రమం దగ్గర పడిన తర్వాత దించేసి.. రెండు విటమిన్‌ ఈ క్యాప్సూల్స్‌ని కట్‌ చేసి అందులో కలపాలి.

దీనిలోనే రెండు టీస్పూన్ల తాజా అలోవెరా జెల్‌ వేసి చక్కగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ఎయిర్‌టైట్‌ కంటైనర్‌లో నిల్వచేసుకోవాలి.

రోజూ రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడుచుకుని ఈ క్రీమ్‌ను అప్లైచేసి ఐదునిమిషాలు మర్దన చేసి పడుకోవాలి.

ఉదయాన్నే నీటితో కడిగేయాలి.

జిడ్డు చర్మం కలిగిన వారు క్రీమ్‌ తయారీలో గ్రీన్‌ టీకి బదులు టీ ట్రీ ఆయిల్‌ను వాడుకుంటే మంచిది.

ఈ క్రీమ్‌ను రోజూ పడుకునే ముందు ముఖానికి రాసుకోవడం వల్ల కాలుష్యం, ఎండవేడికి చర్మం పాడకుండా ఉంటుంది.

అలోవెరా జెల్‌ చర్మకణాలను లోతుగా శుభ్రం చేస్తే, కాఫీ పొడి నల్లటి మచ్చలను తొలగిస్తుంది.

గ్రీన్‌ టీ మొటిమలను తగ్గిస్తుంది.

విటమిన్‌ ఈ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మారుస్తుంది.