విజయబాపినీడు జయంతి నేడు

1936 సెప్టెంబర్‌ 22న ఏలూరు తాలుకా చాటపర్రులో జననం

చదువుకొనే రోజుల నుంచే కథలు, నాటకాలు రాయడం అలవాటు

బాలల కోసం ‘బొమ్మరిల్లు’మాస పత్రికను నెలకొల్పారు

‘విజయ’మాస పత్రికను కూడా విజయవంతంగా నడిపారు

ఆ పత్రిక పేరే ఆయన ముందు చేరి, విజయబాపినీడు అయ్యాడు

మాగంటి రవీంద్రనాథ్ చౌదరి సహకారంతో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు

దాసరి ‘యవ్వనం కాటేసింది’చిత్రానికి నిర్వాహణ బాధ్యతలు చూసుకున్నాడు

‘శ్యామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్’పతాకంపై రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన చిత్రాలన్నిటికీ నిర్మాణతగా బాపినీడు పేరు ఉండేది

‘రంభ ఊర్వశి మేనక’, ‘మరో అహల్య’ వంటి చిత్రాలను నిర్మించాడు

చిరంజీవి ‘మగమహారాజు’చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు

ఆ సినిమా అయ్యాక విజయబాపినీడు దర్శకత్వంలో ‘హీరో’ చిత్రం నిర్మించారు అల్లు అరవింద్

చిరు, బాపినీడు కాంబోలో మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ చిత్రాలు తెరకెక్కాయి

బాపినీడు దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘కొడుకులు(1998)’

2019 ఫిబ్రవరి 11న విజయ బాపినీడు కన్నుమూశారు