దేశంలో షావోమీ (Xiaomi) 13 ప్రో పూర్తిస్థాయి అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

షావోమీ ఇండియా వెబ్‌సైట్, అమెజాన్‌, ఎంఐ హోమ్స్, ఎంఐ రిటైల్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.

భారత్‌లో షావోమీ 13 ప్రో ధర రూ.79,999. ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగస్వామ్యంతో రూ. 10,000 తక్షణ తగ్గింపు

షావోమీ లేదా రెడ్‌మీ ఫోన్లపై రూ. 12,000 ఎక్స్ఛేంజ్ బోనస్. ఇతర ఫోన్లపై రూ.8,000.

12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో.. సిరామిక్ వైట్, సిరామిక్ బ్లాక్ కలర్స్‌లో లభ్యం

మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలు (వైడ్ + అల్ట్రా వైడ్ + టెలిఫొటో), 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా.

6.7 అంగుళాల 2కే కర్వ్‌డ్‌ డిస్‌ప్లే.

4,820 ఎంఏహెచ్‌ బ్యాటరీ. 120 వాట్ల వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌, 50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్.

క్వాల్‌కాం (Qualcomm) స్నాప్‌డ్రాగన్‌ (Snapdragon 8 Gen 2 SoC). అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్.