కొత్త స్మార్ట్‌ ఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా?

అక్టోబరు నెలలో వరుసగా విడుదలవుతున్న ఫోన్‌లు ఇవే

పిక్సెల్ 7 సిరీస్‌తో భారత మార్కెట్లోకి గూగుల్‌ రీఎంట్రీ. అక్టోబరు 6న పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రో పేరుతో రెండు మోడల్స్‌ విడుదల చేయనున్న టెక్‌ దిగ్గజం

షావోమి, ఒప్పో తరహాలో మోటోరోలా కూడా వరుసగా కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తోంది. అక్టోబరు నెలలో కూడా మోటో ఎడ్జ్‌ 30 నియో మోడల్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ ధర రూ. 20 వేలలో ఉండొచ్చని అంచనా.

నార్డ్‌ సిరీస్‌లో వన్‌ప్లస్‌ కంపెనీ మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తుంది. వన్‌ప్లస్‌ నార్డ్ 3 పేరుతో విడుదల చేయనున్న ఈ ఫోన్‌ ధర రూ.30 వేల నుంచి రూ. 35 వేల మధ్య ఉండనుంది.

షావోమి ఫ్లాగ్‌షిప్‌ సెగ్మెంట్‌లో షావోమి 12టీ సిరీస్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ ధర 50 వేల నుంచి రూ. 60 వేల మధ్య ఉంటుందని సమాచారం.

అక్టోబరు రెండు లేదా మూడో వారంలో షావోమి 12 లైట్‌ విడుదల కానుంది. ఈ ఫోన్‌ ధర ధర రూ. 30 వేలలోపలే ఉంటుందని అంచనా.

రియల్‌మీ కంపెనీ 10 సిరీస్‌లో వేర్వేరు వేరియంట్లను విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో తొలి ఫోన్‌ను అక్టోబరులో తీసుకురానుంది. తర్వాత 10 ప్రో, 10 5జీ, 10 అల్ట్రా, 10+ వేరియంట్లను పరిచయం చేయనుంది.

90 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.44 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వివో వి25ఈ విడుదల కానుంది. ఈ ఫోన్‌ ధర రూ.20ల లోపు ఉండనుంది.

ఎమ్‌ సిరీస్‌లో పోకో నుంచి వస్తోన్న ఆరో మోడల్‌ ‘పోకో ఎమ్‌5ఎస్‌’ ఈ ఫోన్‌ ధర రూ. 15 వేల లోపు ఉంటుంది

బడ్జెట్‌ రేంజ్‌లో ఒప్పో కంపెనీ ఒప్పో ఏ17, ఒప్పో ఏ77ఎస్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ల ధర రూ.9 వేల నుంచి రూ.10 వేల మధ్య ఉంటుందని అంచనా.