ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) నుంచి పలు సందర్భాల్లో నగదు ఉపసంహరించుకోవచ్చు.

ఇల్లు లేదా ఫ్లాట్‌ కొనుగోలు లేదా నిర్మాణం, రుణాల చెల్లింపు

కొన్ని వ్యాధులకు సంబంధించి చికిత్సా వ్యయాల చెల్లింపులకు

వివాహం లేదా పిల్లల ఉన్నత విద్య

రిటైర్మెంట్‌కు ఏడాది ముందు

స్వయంగా తమ వివాహం కోసం లేదంటే కుమార్తె, కుమారుడు, సోదరుడు లేదా సోదరి వివాహం కోసం ఉపసంహరించుకోవాలంటే కనీసం ఏడేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకోవాలి.

ఉద్యోగి వాటా కింద జమ అయి, దానికి వడ్డీ చేరగా సమకూరిన మొత్తం నుంచి 50 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు.

ప్రతి అవసరం కోసం మూడు సార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు

ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత చేసే ఉపసంహరణలపై పన్ను ఉండదు

కోవిడ్‌ సమయంలో చేసిన ఉపసంహరణ ప్రభావం తాజా విత్‌డ్రాలపై ఉండదు.