ప్రతీ 30 గంటలకు ఒక బిలియనీర్‌ పుట్టుకొస్తున్నాడు

ఒకవైపు బిలియనీర్ల సంపద పెరుగుతుండగా, పేదరికం అంతకు మించి పెరుగుతోంది.

కరోనాకు ముందు 23 ఏళ్లలో ఏర్పడిన సంపద కంటే కరోనా వచ్చిన రెండేళ్లలో బిలియనీర్ల సంపద ఎక్కువగా ఉన్నట్లు ఆక్స్‌ఫామ్‌ నివేదికలో వెల్లడి

కరోనా కాలంలో ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్‌ (బిలియన్‌ డాలర్లు అంతకుమించి సంపద కలిగినవారు) కొత్తగా పుట్టుకువచ్చారు

ప్రపంచంలోని బిలియనీర్ల సంపద విలువ ప్రపంచ జీడీపీలో 13.9 శాతానికి సమానం.

2000లో ప్రపంచ జీడీపీలో బిలియర్ల సంపద 4.4 శాతమే ఉండగా, ఇప్పుడు భారీగా పెరిగింది

అదే సమయంలో కరోనా వైరస్‌ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయిన అసమానతలు

ఈ ఏడాది ప్రతి 33 గంటలకు సుమారు పది లక్షల మంది తీవ్ర పేదరికంలోకి జారుకున్నారు.

ఈ ఏడాది 26.3 కోట్ల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని అంచనా

రికార్డు స్థాయి ఆహార ధరలతో శ్రీలంక నుంచి సూడాన్‌ వరకు సామాజికంగా అశాంతి

ప్రపంచంలో అట్టడుగున ఉన్న 301 కోట్ల ప్రజల (40 శాతం) ఉమ్మడి సంపద కంటే టాప్‌ 10 ప్రపంచ బిలియనీర్ల వద్దే ఎక్కువ ఉంది.