2014 సెప్టెంబరు 1 నాటికి అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లిస్తూ, అధిక పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి

జనవరి 5న మార్చి 3లోగా ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని సూచన

సుప్రీం ఆదేశాలతో లబ్ధి దారులు అప్లయి చేసుకునేందుకు వీలుగా లింక్‌ను అందుబాటులోకి తెచ్చిన ఈపీఎఫ్‌వో

గడువు తేదీకి 15 రోజుల ముందు వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తులో సాంకేతిక సమస్యలు

లింకు తెరుచుకోకపోవడం, తర్వాత ఆధార్‌ అనుసంధానంలో తలెత్తిన సమస్యలు

కానీ సంస్థ కేంద్ర కార్యాలయం ముందే ప్రకటించిన మేరకు ఈ నెల 3తో గడువు ముగిసిందని పేర్కొంటూ మెంబర్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ దరఖాస్తు లింకు తొలగింపు

గడువు తేదీ నాటికి 91,258 మంది రిటైర్డ్‌ ఉద్యోగుల నుంచి దరఖాస్తులు వచ్చాయని ఈపీఎఫ్‌వో వెల్లడి

సుప్రీంకోర్టు నిబంధనల మేరకు నాలుగు నెలల గడువు ఇవ్వాలని, రెండు నెలలు మాత్రమే ఇచ్చారని అంటున్న పెన్షన్‌ లబ్ధి దారులు

సాంకేతిక సమస్యల దృష్ట్యా కనీసం నెల రోజులు గడువు పొడిగించాలని విజ్ఞప్తి