నూతన పన్ను విధానం 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి అంటే వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తోంది.

ఉద్యోగులు, పెన్షనర్లు రూ. 7.5 లక్షల వరకూ వార్షిక ఆదాయంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

2023 బడ్జెట్లో ప్రభుత్వం చెప్పిన ప్రకారం.. వార్షిక ఆదాయం రూ. 7 లక్షలకు మించకుంటే ఎలాంటి పన్ను లేదు.

ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87ఏ కింద లభించే గరిష్ట రాయితీ పరిమితిని ప్రభుత్వం రూ.12,500 నుంచి రూ.25,000కి పెంచింది.

సెక్షన్ 87ఏ కింద రాయితీ కేవలం భారత్‌లో నివాసం ఉంటున్న వారికి మాత్రమే.

ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 2023 కొత్త బడ్జెట్‌లో రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను పొడిగించింది.

2023 బడ్జెట్‌లో ప్రకటించిన తగ్గింపు, రాయితీ, ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పుల ఫలితంగా రూ. 7.5 లక్షల వరకూ ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.