2022-23 ఆర్థిక సంవత్సరం పూర్తయి కొత్త ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రారంభం కాబోతోంది.

ఆదాయపు పన్ను కొత్త నియమాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

వార్షికాదాయం రూ.7 లక్షల కంటే తక్కువుండి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి టీడీఎస్‌ ఉండదు. ఐటీ యాక్ట్‌ సెక్షన్ 87ఏ కింద మినహాయింపు ఉంటుంది.

సెక్షన్ 193 కింద డీమెటీరియలైజ్డ్ లిస్టెడ్ డిబెంచర్లకు టీడీఎస్‌ కోతలు ఉండవు. ఇతర అన్ని చెల్లింపులపై 10 శాతం టీడీఎస్‌ రూపంలో కోత ఉంటుంది.

ఆన్‌లైన్ గేమ్‌ల ద్వారా డబ్బు గెలుచుకున్న వారు కొత్త సెక్షన్ 115 BBJ ప్రకారం 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని టీడీఎస్‌ రూపంలో కట్‌ చేస్తారు.

సెక్షన్ 54, 54ఎఫ్ కింద రూ.10 కోట్ల వరకు మూలధన లాభాలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. అంతకు మించిన మూలధన లాభాలపై 20 శాతం పన్ను విధిస్తారు.

ఆస్తి అమ్మకం ద్వారా వచ్చే లాభంపై అధిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సెక్షన్ 24 కింద క్లెయిమ్ చేసే వడ్డీని కొనుగోలు లేదా మరమ్మతు ఖర్చులో చేర్చేందుకు వీలు లేదు.

మార్కెట్ లింక్డ్ డిబెంచర్ల బదిలీ, రిడెంప్షన్ లేదా మెచ్యూరిటీ నుంచి వచ్చే మూలధన లాభాలపై ఇప్పుడు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను ఉంటుంది.

ఈ-గోల్డ్ రిసీప్ట్‌గా మార్చుకున్న ఫిజికల్ గోల్డ్ లేదా ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకున్న ఈ-గోల్డ్ రిసీప్ట్‌పై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ ఉండదు.