లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్. అంచనా విలువ 4.9 బిలియన్ డాలర్లు. ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు.

భారత్‌లోని ముంబైలోని యాంటిలియా టవర్. అంచనా విలువ 2 బిలియన్ డాలర్లు. బిలియనీర్ ముఖేష్ అంబానీ కుటుంబం నివాసముంటున్నారు.

ఫ్రాన్స్‌లోని విల్లా లా లియోపోల్డా. అంచనా విలువ 750 మిలియన్ డాలర్లు. బ్రెజిలియన్ బ్యాంకర్ ఎడ్మండ్ సఫ్రా భార్య లిల్లీ సఫ్రా యాజమాన్యంలో ఉంది.

యూఎస్‌లోని ది వన్ ఇన్ బెల్ ఎయిర్. అంచనా విలువ 500 మిలియన్ డాలర్లు.

లండన్‌లోని విటన్‌హర్ట్స్‌. అంచనా విలువ 450 మిలియన్ డాలర్లు. లండన్‌లో రెండో అతిపెద్ద నివాసం.

ఫ్రాన్స్‌లోని బుల్లెస్ ప్యాలెస్. అంచనా విలువ 420 మిలియన్ డాలర్లు

ఫ్రాన్స్‌లోని విల్లా లెస్ సెడ్రెస్. అంచనా విలువ 410 మిలియన్ డాలర్లు. 1904లో బెల్జియం రాజు లియోపోల్డ్ కొన్నారు.

మొనాకోలోని ఓడియన్ టవర్ పెంట్ హౌస్. అంచనా విలువ 335 మిలియన్ డాలర్లు.

తూర్పు టెక్సాస్ పాన్‌హ్యాండిల్‌లోని మీసా విస్టా రాంచ్. అంచనా విలువ 250 మిలియన్ డాలర్లు.

న్యూయార్క్‌లోని ఫోర్‌ ఫెయిర్‌ఫీల్డ్ పాండ్‌. అంచనా విలువ 248 మిలియన్ డాలర్లు.

న్యూయార్క్ లోని 220 సెంట్రల్ పార్క్ సౌత్ పెంట్ హౌస్. అంచనా విలువ 238 మిలియన్ డాలర్లు.

లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్. అంచనా విలువ 222 మిలియన్ డాలర్లు. భారతీయ ఉక్కు పరిశ్రమ దిగ్గజం లక్ష్మి మిట్టల్‌ దీన్ని కొన్నారు.