ఇటీవలి కాలంలో అందరి నోళ్లలోనూ బాగా నానుతున్న పేరు.. మూన్‌లైటింగ్‌

మూన్‌లైటింగ్‌ అంటే.. ఒక సంస్థలో పర్మనెంట్‌ ఉద్యోగిగా ఉంటూ ఖాళీ సమయాల్లో ఇతర సంస్థలకు పని చేయడం

జీతం చాలక లేదా అదనపు ఆదాయం కోసం ఈ దారిలో కొందరు పయనిస్తున్నారు

మూన్‌లైటింగ్‌ అనైతికమంటూ ఐటీ సంస్థల వాదన

విప్రో సంస్థ 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడంతో తెరపైకి రచ్చ

విప్రోతో పాటు ఇన్ఫోసిస్‌, ఐబీఎం కూడా మూన్‌లైటింగ్‌ను అంగీకరించబోమని స్పష్టీకరణ

మరో వైపు దీన్ని సమర్థించిన టెక్‌ మహీంద్రా. ఇదే బాటలో స్విగ్గీ, ఫిన్‌టెక్, యూనికార్న్, క్రెడ్‌ సంస్థలు

2018లోనే అమెరికాలో 7.2 శాతం పెరిగిన బహుళ ఉద్యోగాలు చేసేవారి సంఖ్య

ముఖ్యంగా యూఎస్‌లలో మహిళలు అధికంగా మూన్‌లైటింగ్‌ చేస్తున్నట్టు తేలింది