పుణెకు చెందిన మేఘనా నారాయణ్‌కు పిల్లల పోషణ, ఆరోగ్యం పట్ల మక్కువ ఎక్కువ.

2015లో మరో ఇద్దరితో కలిసి హోల్సమ్ ఫుడ్స్ (స్లర్ప్ ఫార్మ్ అండ్‌ మిల్లె) స్థాపన.

స్లర్ప్ ఫాం 2022 ఫిబ్రవరి నాటికి రూ. 57 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.

తన పాపాయికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి చేసిన ప్రయత్నాలే ఈ వ్యాపారం ప్రారంభించేలా చేశాయి.

స్లర్ప్ ఫామ్ ప్రారంభించే ముందు మేఘనా మెకన్సీ అండ్‌ కంపెనీలో పబ్లిక్ హెల్త్ ప్రాక్టీస్‌కు నాయకత్వం వహించారు.

స్లర్ప్ ఫార్మ్ సంస్థలో ప్రముఖ బాలివుడ్‌ నటి అనుష్క శర్మ కూడా పెట్టుబడి పెట్టడం విశేషం.

మేఘనా నారాయణ్ అంతర్జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్. 400 బంగారు పతకాలను సాధించారు. 8 ఏళ్ల పాటు భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.

బెంగళూరు యూనివర్సిటీ నుంచి బీఈ, ఆక్స్‌ఫర్డ్‌లోని ఓరియల్ కాలేజీకి రోడ్స్ స్కాలర్‌గా కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ.