ఒడిశాలోని రాయ్‌గఢ్‌లో మార్వారీ కుటుంబంలో జన్మించిన ఓయో అధినేత రితేశ్‌ అగర్వాల్‌

గతంలో ఆయన కుటుంబ సభ్యులు చిన్న దుకాణం నిర్వహించగా అందులో సిమ్‌కార్డులను విక్రయించిన రితేష్‌ అగర్వాల్‌

రాయగఢ్‌లోనే పాఠశాల విద్యనభ్యసించిన రితేశ్‌.. రాజస్థాన్‌లోని కోటలో సెయింట్‌ జాన్స్‌ సీనియర్‌ సెకెండరీ స్కూల్‌లో ఇంటర్‌ పూర్తి

ఉన్నత విద్యకోసం ఢిల్లీకి పయనం.. రెండేళ్ల తర్వాత డ్రాప్‌ అవుట్‌గా మారిన రితేష్‌

అదే సమయంలో యువ వ్యాపార వేత్తల కోసం నిర్వహించిన థీల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన వారిలో ఒకరిగా నిలిచిన ఓయో ఫౌండర్‌

థీల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు వచ్చిన లక్ష డాలర్ల గ్రాంటుతో 2013 మే నెలలో ఓయో ఏర్పాటు

19 ఏళ్ల వయసులో తక్కువ ధరల్లోనే నాణ్యమైన గదులతో హోటల్స్‌ వసతి కల్పించే ఓయో రూమ్స్‌ సంస్థ ప్రారంభం

ఒక్క హోటల్‌తో ప్రారంభమై ఇప్పుడు 800 నగరాలకు పైగా విస్తరించిన ఓయో సేవలు

ప్రస్తుతం సిమ్‌ కార్డులు అమ్మే బాయ్‌ నుంచి రూ.8వేల కోట్ల అధిపతిగా ఎదిగిని రితేష్‌ అగర్వాల్‌ జీవితం