వివిధ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్‌ సంస్థలు మహిళలకు తక్కువ వడ్డీతో హోమ్ లోన్స్ అందిస్తున్నాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం హోమ్‌ లోన్లు తీసుకునే మహిళలకు స్టాంప్ డ్యూటీపై 1 నుంచి 2 శాతం డిస్కౌంట్‌ ఉంటుంది.

రూ.50 లక్షల విలువైన ప్రాపర్టీపై రూ.50,000 నుంచి రూ.1,00,000 ఆదా చేయొచ్చు.

హోమ్‌లోన్‌ రీపేమెంట్‌లో.. ప్రిన్సిపల్‌ రీపేమెంట్, వడ్డీ చెల్లింపులకు గరిష్టంగా రూ.1.5 లక్షలు, రూ.2 లక్షలు ట్యాక్స్‌ డిడక్షన్‌ ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో హోంలోన్‌పై ప్రారంభ వడ్డీ 8.55 శాతం కాగా మహిళలకు 0.05 శాతం తగ్గింపు ఇస్తోంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభ వడ్డీ 8.85 శాతంలో 0.05 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది.

కెనరా బ్యాంక్‌ హోమ్‌లోన్‌లపై మహిళలకు 5 బేసిస్ పాయింట్ల డిస్కౌంట్‌ అందజేస్తోంది. ప్రారంభ వడ్డీ 8.85 శాతం.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కూడా 5 బేసిస్ పాయింట్ల డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. వడ్డీ రేటు 8.60 శాతం నుంచి ప్రారంభమవుతుంది.

స్టేట్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హోమ్‌లోన్‌పై ప్రారంభ వడ్డీ రేటు 8.85 శాతం. మహిళలకు 5 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఉంటుంది.