చార్జీలు, ట్రిప్‌ల రద్దు విషయాల్లో క్యాబ్‌ అగ్రిగేటర్లపై భారీగా ఫిర్యాదులు

కొన్ని సందర్భాల్లో ట్రిప్‌లను అంగీకరించడానికి ఇష్టపడని డ్రైవర్లు క్యాన్సిల్‌ చేసుకోవాలని వినియోగదారులపై ఒత్తిడి.

వినియోగదారులు ట్రిప్‌ క్యాన్సిల్‌ చేస్తే పెనాల్టీలు విధింపు

అసలు ఏ ప్రాతిపదికన ప్రయాణ చార్జీలను నిర్ణయిస్తున్నారన్న అంశంపై లోపించిన పారదర్శకత

ఫిర్యాదుల వెల్లువెత్తుతున్న నేపథ్యంలో క్యాబ్‌ అగ్రిగేటర్స్‌తో కేంద్రం భేటీ

సిస్టమ్‌లను సత్వరం మెరుగుపర్చుకోవాలని, వినియోగదారుల ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని కేంద్రం ఆదేశం

లోపాలు సరిచేసుకోవాల్సిందే. లేకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసిన వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌

క్యాబ్‌ అగ్రిగేటర్స్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రోహిత్‌ కుమార్‌ సింగ్‌

ట్యాక్సీ సేవల సంస్థలు సత్వరం పరిష్కార మార్గాలతో ముందుకు రావాలని సీసీపీఏ చీఫ్‌ కమిషనర్‌ నిధి ఖరే సూచన

వినియోగదారుల హక్కులకు భంగం కలిగేలా క్యాబ్‌ అగ్రిగేటర్లు అనుచిత వ్యాపార విధానాలు పాటించకుండా త్వరలోనే ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడి