రైతులకు శుభవార్త.. వారికి నెల నెలా పెన్షన్‌ .. అర్హత ఏంటి?

రైతుల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు అందుబాటులోకి తెస్తున్న కేంద్రం

ఇప్పటికే వారి కోసం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, పెట్టుబడి కోసం పీఎం-కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం అమలు

తాజాగా వయసు పైబడిన రైతులకు ఆర్థికంగా తోడుగా నిలవాలనే ఉద్దేశంతో మరో పథకాన్ని అమలు చేస్తున్న కేంద్రం

ప్రధాన మంత్రి కిసాన్‌ మాన్‌ధన్‌ యోజన పేరుతో 60 ఏళ్లు నిండిన రైతులు నెలకు కనీసం రూ.3 వేల చొప్పున పెన్షన్‌ పొందచ్చు.

ఇందుకోసం రైతులు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంబంధిత భూ రికార్డుల్లో పేర్లు ఉండాలి

అందులో 2 హెక్టార్ల (4.94211ఎకరాల) వరకు సాగు చేయదగిన భూమి కలిగి ఉండాలి

18-40 మధ్య వయసున్నవారై ఉండాలి.. వయసు 60 దాటాక ఈ పథకం కింద నెలకు కనీస పింఛను రూ.3 వేలు అందుతుంది.

ఒక వేళ అర్హుడైన వ్యక్తి మరణిస్తే అతడి జీవిత భాగస్వామికి 50 శాతం పెన్షన్‌ వస్తుంది. అతడి పిల్లలకు వర్తించదు.

అర్హుడైన రైతు తనకు 60 ఏళ్లు వచ్చేంత వరకు నెలకు రూ.55 నుంచి రూ.220 వరకు చెల్లించాలి.

రైతుకు 60 ఏళ్లు నిండగానే పెన్షన్‌ కోసం క్లెయిమ్‌ చేసుకోవాలి. అనంతరం ప్రతి నెలా రైతు బ్యాంక్‌ ఖాతాలో ప్రభుత్వం ఆ పెన్షన్‌ను అందిస్తుంది.