ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉన్నాం.

పన్ను ఆదా కోసం ట్యాక్స్‌ ప్లానింగ్‌ చాలా ముఖ్యమైన అంశం.

ట్యాక్స్‌ ప్లానింగ్‌ చేసుకునేటప్పుడు సాధారణంగా చేసే కొన్ని పొరపాట్లు ఉన్నాయి.

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు రాయితీ ఉంటుంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు సరైన ప్రణాళిక అవసరం.

బీమా పెట్టుబడిలో ప్రీమియం ఏడాది రూ.5 లక్షలు మించకూడదు. మించితే పన్ను మినహాయింపు ఉండదని 2023 బడ్జెట్ స్పష్టం చేసింది.

పన్ను మినహాయింపుల కోసమని క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం చాలా పొరపాటు. ఇది అప్పులు పెరిగేందుకు దారితీయవచ్చు.

ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ట్యాక్స్‌ ప్లానింగ్‌ ఒత్తిడికి గురిచేస్తుంది. ముందుగానే ట్యాక్స్‌ ప్లానింగ్‌ చేసుకోవడం మంచిది.