120 ఏళ్ల సేవలకు సిటీ బ్యాంక్‌ సెలవు

భారత్‌లో సేవలందిస్తున్న దేశీ, విదేశీ బ్యాంకులు

బ్యాంకులు లాభసాటిగా కొనసాగుతున్న సమయంలో అమెరికా బ్యాంకింగ్‌ దిగ్గజ సంస్థ సిటీ గ్రూప్‌ తమ సిటీ బ్యాంక్‌ను యాక్సిస్‌ బ్యాంక్‌లో విలీనం చేస్తున్న ప్రకటన

1902లో భారత్ లో ప్రవేశించి 1985నుంచి బ్యాంకింగ్ బిజినెస్ ని పూర్తి స్థాయిలో విస్తరించిన సిటీ బ్యాంక్‌

అయితే ఇటీవలి పరిణామాలు, బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులు, అవసరమైన భారీ పెట్టుబడుల విషయంలో.. విలీనానికి సిద్ధమైన దిగ్గజ బ్యాంక్‌

విలీనంతో అయోమయంలో సిటీ బ్యాంక్‌ కస్టమర్లు

వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా సిటీ బ్యాంక్‌ వివరణ

సిటీ బ్యాంక్‌ ఇండియా వెబ్‌సైట్‌లో తన కస్టమర్‌లకు యాక్సిస్ బ్యాంక్ సేవలందిస్తుందని ప్రకటన

వినియోగదారులు ప్రస్తుతం ఉన్న అన్ని శాఖలు, ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చని స్పష్టత

సిటీ ఇండియా శాఖలన్నీ యాక్సిస్ బ్యాంక్‌గా రీబ్రాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేసిన సిటీ బ్యాంక్‌

విలీనంతో మార్చి 1 నుంచి కనిపించని సిటీ బ్యాంక్ బ్రాంచులు

యాక్సిస్ బ్యాంక్ బ్రాంచులుగా మారిపోనున్న సిటీ బ్యాంక్‌లు