ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ తన కస్టమర్ల గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

తక్కవ ధరకే అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌ పేరిట ఓ కొత్త ప్లాన్‌ని తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది.

గతంలో తన వార్షిక ప్లాన్ ధరను రూ. 999 నుంచి రూ. 1499కి పెంచిన సంగతి తెలిసిందే

అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌లో.. అమెజాన్‌ ప్రైమ్‌ తరహాలోనే లైట్‌లోనూ కొన్ని మినహాయింపులతో దాదాపు అవే సదుపాయాలను అందించబోతున్నారు.

టెస్టింగ్‌ దశలో ఉన్న ఈ వెర్షన్‌ను, ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంచింది అమెజాన్‌

మ్యూజిక్‌, బుక్స్‌, గేమ్స్‌ అవసరం లేదనుకునేవారికి ఈ ప్లాన్‌ ఉపయోగపడుతుంది. ఈ రెండూ కాకుండా అమెజాన్‌ ఏడాదికి రూ.599కే ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ప్లాన్‌ అందిస్తోంది

అమెజాన్‌ ప్రైమ్‌ యూజర్లకు సేమ్‌ డే డెలివరీ, వన్‌ డే డెలివరీ సదుపాయం ఉంది. అయితే త్వరలో రాబోతున్న లైట్‌ యూజర్లకు మాత్రం ఈ సదుపాయం ఉండదు

నెట్‌ఫ్లిక్స్ తర్వాత, యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టనున్న అమెజాన్‌