కోమలమైన చేతుల కోసం... బ్యూటిప్స్‌

పొడిబారిపోయిన చేతులను ఇంట్లోనే సులభంగా కోమలంగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

చర్మానికి తేమ నివ్వడంలో గులాబీ పువ్వులు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

ఒక గిన్నెలో చేతులు మునిగే అన్ని వేడి నీళ్లు తీసుకోవాలి.

ఈ నీళ్లలో రెండు గులాబీ రేకులు, నాలుగు చుక్కల రోజ్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి కలపాలి.

ఈ నీటిలో చేతులు ముంచి పదిహేను నిమిషాలపాటు నానబెట్టాలి.

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసి చేతులను ముంచి పది నిమిషాలు నానబెట్టి తరువాత కడిగేయాలి.

తరువాత చేతులకు రాసుకునే క్రీమ్‌ రాసి మర్దనా చేయాలి.

గిన్నెలో వేడినీళ్లు తీసుకుని ఎప్సం సాల్ట్, కొద్దిగా కొబ్బరి నూనె వేసి చేతులను పదిహేను నిమిషాలబాటు నానబెట్టి తరువాత కడిగేయాలి.

ఇలా చేస్తే పొడిబారిన చేతుల నుంచి వచ్చే దురద తగ్గుతుంది.

వీటిలో ఏదైనా ఒక దానిని క్రమం తప్పకుండా పాటించడం వల్ల చేతులు మృదువుగా మారతాయి.