ఏ వేడుక అయినా అమ్మాయిలకు వెంటనే గుర్తుకు వచ్చేది లెహంగా!

పూర్తి సంప్రదాయంగా కాకుండా... కొంచెం వెస్ట్రన్‌ స్టైల్‌ కూడా మిక్స్‌ అవాలని కోరుకుంటారు.

అందుకు సరైన ఎంపిక ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌తో ముస్తాబు చేసిన ముచ్చటైన లెహంగా!!

దినచర్యలో భాగంగా ఉదయాన్నే పూలను సేకరించే చేతులు, అందంగా అలంకరించుకుంటున్న అతివల బొమ్మలతో కొత్త డిజైన్లు.

ఆనంద నృత్యకేళీ, అంబారీ యాత్ర... బొమ్మలా కనిపించే అమ్మాయిల లెహంగా పైన రూపుదిద్దుకున్న అందమైన డిజైన్లు.

సంప్రదాయ వేడుకలకు, వెస్ట్రన్‌ గెట్‌ టు గెదర్‌లకు మరిన్ని వన్నెలను అద్దుతున్నాయి.

ఫ్యాబ్రిక్‌ పెయింటింగ్‌లో వచ్చిన కొత్త నైపుణ్యాలు, మరిన్ని డిజైన్లు లెహంగాలను మరింత వైభవంగా అలంకరిస్తున్నాయి.

ఎంబ్రాయిడరీ పెయింటింగ్‌ కాంబినేషన్‌లోనూ వచ్చే డిజైన్లు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.