బ్యూటిప్‌: వైట్‌ హెడ్స్‌ ఇలా తొలగిద్దాం

టొమాటోలలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. అంతేగాక ఇందులోని ఇతర పోషకాలు చర్మసమస్యలను తగ్గించడంలో సాయపడతాయి

వైట్‌ హెడ్స్‌ వెంటనే తొలగిపోవాలంటే.. టొమాటోను రెండు స్లైసులుగా కట్‌ చేసి ముఖం మీద రుద్దాలి. ఆరాక కడిగేయాలి.

వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే వైట్‌హెడ్స్‌ కనిపించవు.

పెరుగులోని ల్యాక్టిక్‌ యాసిడ్‌ కూడా చర్మాన్ని సంరక్షిస్తుంది.

మూడు టేబుల్‌ స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల ఓట్స్‌ వేసి కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మర్దన చేయాలి. పదినిమిషాలు ఆరాక కడిగేయాలి. ఈ ప్యాక్‌ వైట్‌ హెడ్స్‌ను తగ్గిస్తుంది.

ముల్తానీ మట్టి చర్మాన్ని చల్లగా ఉంచడంతోపాటు, వైట్‌హెడ్స్‌ను తొలగిస్తుంది.

ముల్తానీ మట్టిని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసి ఇరవై నిమిషాలు ఆరాక నీటితో కడిగేయాలి.

ఈ మూడింటిలో ఏది పాటించినా వైట్‌ హెడ్స్‌ సమస్య తీరుతుంది.