మనం స్నానానికి వాడే ప్రతి సబ్బును అనేక రసాయనాలతో తయారు చేస్తారు. వీటివల్ల.. చర్మం పొడిబారిపోతుంది.

అందువల్ల ఇంట్లో తయారు చేసుకున్న మిశ్రమంతో స్నానం చేస్తే చర్మం శుభ్రపడడమేగాక ఆరోగ్యంగానూ ఉంటుంది.

టీస్పూను చొప్పున బాదం పప్పు పేస్టు, పిస్తా పేస్టు, టీజీడిప్పు పేస్టు, గోధుమ గడ్డి నూనె, గోధుమ పిండి తీసుకోవాలి.

వీటితోపాటు పావు కప్పు శనగపిండి, టీ స్పూను క్రీమ్, టీస్పూను రోజ్‌ వాటర్‌ను ఒక గిన్నెలో తీసుకుని అన్నింటిని పేస్టులా కలపుకోవాలి.

ఈ పేస్టునూ ముఖం నుంచి ఒళ్లంతా రాసుకుని ఐదు నిమిషాలు మర్దన చేయాలి. అరగంట తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.

మూడు స్పూన్ల శనగపిండి, స్పూను వేపాకు పొడి, 2 స్పూన్ల గంధం పొడి, పసుపు చిటికెడు, కీరా గుజ్జు రెండు స్పూన్లు తీసుకోవాలి.

వీటన్నింటిని ఒక గిన్నెలో వేసి పేస్టులా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని శరీరం మొత్తానికి అప్లై చేసి ఐదునిమిషాలపాటు రుద్ది, ఇరవై నిమిషాల తరువాత స్నానం చేయాలి.

2 స్పూన్ల పాలు, 2 స్పూన్ల శనగపిండి, స్పూను పసుపు, స్పూను గంధంపొడిని తీసుకుని ఒక గిన్నెలో కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని బాడీ మొత్తానికి రాసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. పదిహేను నిమిషాల తరువాత స్నానం చేయాలి.

ఈ మూడింటిలో ఏదైనా ఒకదానిని వారానికి రెండు మూడుసార్లు వాడడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.