ఎండుకొబ్బరిని బరకగా పొడిచేసుకోవాలి.

ఒక స్పూను కొబ్బరి పొడిలో స్పూను పంచదార, రెండు స్పూన్లు రోజ్‌ వాటర్, మూడు చుక్కలు ఆలివ్‌ అయిల్‌ వేసి బాగా కలుపుకోవాలి.

దీనిని ముఖానికి, ఒంటికి రాసుకుని పదినిమిషాలు మర్దన చేసి పదిహేను నిమిషాలపాటు ఆరనివ్వాలి.

తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

వారానికి రెండుసార్లు ఈ స్క్రబ్‌ వాడడం వల్ల చర్మం మీద మృతకణాలు తొలగడంతోపాటు, చర్మానికి చక్కటి పోషణ అందుతుంది.

ట్యాన్‌, మచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ పోయి మేని చాయ నిగారింపుని సంతరించుకుంటుంది.

అరటి తోలుతో మసాజ్‌

ముఖాన్ని నీటితో శుభ్రపరిచి టవల్‌తో తుడుచుకోవాలి.

తర్వాత అరటి తొన లోపలిభాగంతో ముఖచర్మంపై 10 నిముషాలపాటు మర్దన చేయాలి.

మరోపది నిముషాలు ఆరనిచ్చి, చల్లని నీటితో కడిగెయ్యాలి.

ఇలా చేయడం ద్వారా చర్మంపై వాపు, ముడతలు తొలగి ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.