ఇంట్లో దొరికే పదార్థాలతోనే జుట్టుకు మెరుగైన పోషణ అందించవచ్చు.

సహజసిద్ధమైన ఆయిల్స్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా..

ఆనియన్‌ ఆయిల్

ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు సమపాళ్లలో తీసుకుని ముద్దగా నూరుకోవాలి.

ఈ పేస్టుని కొబ్బరి నూనెలో వేసి సన్నని మంటమీద 15 నిమిషాలపాటు మరగనివ్వాలి.

ఈ నూనెను రాత్రంతా పక్కనపెట్టి, ఉదయం వడగట్టి సీసాలో నిల్వచేసుకుని వాడుకోవాలి.

ఇది కురులకు పోషణ అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

మింట్‌ ఆయిల్

పుదీనా ఆకులని మెత్తగా దంచి ఆల్మండ్‌ ఆయిల్‌లో వేసి సుమారు 3 గంటల పాటు ఎండలో పెట్టాలి.

తరువాత ఈ నూనెను తలకు రాసుకోవచ్చు.

మింట్‌ ఆయిల్‌ యాంటీ మైక్రోబియల్‌ గుణాలు కలిగి చుండ్రుని తగ్గిస్తుంది.