ముందుగా కప్పు నీళ్లు ఒక గిన్నెలో పోసి గ్రీన్‌ టీ నాలుగు టేబుల్‌ స్పూన్లు వేసి మరగనిచ్చి, చల్లారనివ్వాలి.

దీనిలో 2 స్పూన్ల పచ్చి పసుపుకొమ్ము రసం, 3 స్పూన్ల అలోవెరా జెల్, 1 స్పూను రోజ్‌ వాటర్, నిమ్మరసం కలిపి రోజంతా ఫ్రిజ్‌లో ఉంచాలి.

మరుసటిరోజూ ఎయిర్‌టైట్‌ స్ప్రే బాటిల్‌లో నిల్వ చేయాలి. ఇది పదిహేను రోజులపాటు తాజాగా ఉంటుంది.

ముఖాన్ని శుభ్రంగా కడిగి, తరువాత పొడిగా తుడుచుకోవాలి.

ఇప్పుడు నిల్వ చేసుకున్న టర్మరిక్‌ ఫేషియల్‌ టోనర్‌ను ముఖం మీద రెండు మూడు సార్లు స్ప్రేచేసి, ఐదు నిమిషాలపాటు మర్దన చేయాలి.

తరువాత గోరువెచ్చని నీటితో కడిగి, మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

ఇది రోజూ వాడడం వల్ల .. చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి ముఖం మీద ఉన్న మచ్చలు, డార్క్‌ సర్కిల్స్‌ను తొలగిస్తుంది.

అలాగే చర్మం సాగిపోకుండా బిగుతుగా ఉంచుతుంది.

చర్మం పీహెచ్‌ స్థాయులు సమస్థితిలో ఉంటాయి.

దీనిలోని యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్‌ గుణాలు మొటిమలు రాకుండా చేస్తాయి.