తలస్నానం తర్వాత పలుచటి వస్త్రంతో తలను మృదువుగా తుడుచుకోవాలి.

ప్రతి 3 నెలలకోసారి స్ప్లిట్‌ ఎండ్స్‌ తీసేసి, జుట్టును ట్రిమ్‌ చేయాలి.

జుట్టుకు పోషకాలనందించే స్పాను తప్పనిసరిగా నెలకోసారి చేసుకోవాలి.

చిక్కులకు కెరాటిన్‌ ట్రీట్‌మెంట్‌ బాగా పనిచేస్తుంది.

దీనివల్ల జుట్టు మృదువుగా మారడమేగాక మెరుపుని సంతరించుకుంటుంది.

మీ జుట్టుకు నప్పే సీరమ్‌ను వాడితే కురులు మృదువుగా మారతాయి.

సల్ఫేట్‌ తక్కువగా ఉండే షాంపు వాడడం వల్ల జుట్టు ఎక్కువ చిక్కుపడదు.

చర్మసంరక్షణలో వాడే గ్లిజరిన్‌ కేశాల సమస్యలకు మంచి పరిష్కారం చూపుతుంది.

గ్లిజరిన్‌ను జుట్టుకు కండీషనర్‌లా పట్టిస్తే.. కురులు పొడిబారడం తగ్గుతుంది

తేనె, ఆలివ్‌ ఆయిల్‌లను హెయిర్‌ మాస్క్‌గా వాడితే స్ప్లింట్‌ ఎండ్స్, చిక్కులు పడడం తగ్గుతుంది.

ఆలివ్‌ ఆయిల్, తేనెను సమపాళల్లో తీసుకుని మైక్రో వేవ్‌లో 30 సెకన్ల పాటు ఉంచాలి.

తరువాత ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి కొద్దిగా మజ్జిగ కలిపి జుట్టుకు పట్టించాలి. అరగంటపాటు ఆరనిచ్చి సాధారణ షాంపూతో కడిగేయాలి.

పడుకునేటప్పుడు తలకింద పెట్టుకునే దిండు కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

కాబట్టి దిండు కవర్‌ సిల్క్‌తో తయారైనదిగా ఉండేలా చూసుకోవాలి. కాటన్‌ దిండు కవర్‌ వల్ల వెంట్రుకలు పొడిబారతాయి.

ఇవన్నీ పాటిస్తే జుట్టు చిక్కులు పడడం తగ్గుతుంది.