పవర్‌ హౌస్‌లాంటి కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్స్, కెఫిక్‌ యాసిడ్‌ ఎక్స్‌ఫోలియేట్‌లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి చర్మకాంతికి నిగారింపునివ్వడంలో ఎంతగానో తోడ్పడతాయి.

ముందుగా టేబుల్‌స్పూను కాఫీపొడిలో ఒకటిన్నర టేబుల్‌స్పూన్ల పచ్చిపాలు పోసి కలపాలి.

శుభ్రంగా కడిగిన ముఖానికి ఈ మిశ్రమాన్ని అఫ్లైచేసి రెండు నిమిషాలు మర్దనా చేసి కడిగేయాలి.

తరువాత రెండు టేబుల్‌స్పూన్ల కాఫీపొడిలో.. అరటీస్పూను పసుపు, రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు వేసి కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి 15 నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి.

ఈ రెండింటిని ఒకదాని తరువాత ఒకటి అమలు చేస్తే ముఖం నిగారింపుని సంతరించుకుంటుంది.