అరిచేతులు, అరికాళ్లు, పెదాలపై చమట గ్రంథులు ఉండవనే విషయం అందరికీ తెలుసు.

అలాగే సహజ నూనెలు ఉత్పత్తి చేసే సేబాషియస్ గ్రంథులు కూడా ఉండవు.

అందుకే వాటి సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఐతే శరీరంలోని ఇతర భాగాలకంటే పెదవులు త్వరగా పొడిబారిపోతాయి.

ఆరెంజ్‌ ఫ్లేవర్‌ లిప్‌బామ్‌ ప్రమాదకర సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పించి సహజ కండిషనింగ్‌లా పనిచేస్తుంది.

పెదాలపై డెడ్‌ స్కిన్‌ పొరను తొలగించాలంటే వారానికి ఒకసారైనా టూత్‌ బ్రష్‌తో షుగర్ స్క్రబ్‌ను అప్లై చేయాలి.

వెన్నను పెదాలపై రాయడం వల్ల ఎల్లప్పుడూ తేమగా, మృదువుగా కనిపిస్తాయి.

విటమిన్లు పుష్కలంగా ఉండే పండ్లు ఆకుకూరలు తినాలి. అలాగే అధికంగా నీళ్లు తాగడం మంచిది.

కుంకుమపువ్వు, పెరుగును కలిపి రోజుకి 2, 3 సార్లు అప్లై చేస్తే, మీ పెదాల సహజ కాంతి చెక్కుచెదరదు.

అర టీస్పూన్ గ్లిజరిన్, ఆముదం, నిమ్మరసం తీసుకుని, వీటిని బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని పెదవులపై అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఇలాచేస్తే పెదాలపై పేరుకుపోయిన ట్యాన్‌ తొలగిపోతుంది.

రోజుకి 12 గ్లాసుల నీరు త్రాగడం వలన మీ శరీరం మాత్రమేకాకుండా పెదవులు హైడ్రేట్ అవుతాయి.